11, జూన్ 2014, బుధవారం

రైతుల రుణ మాఫీ - మంచిదా ? కాదా?

రైతుల రుణ మాఫీ, మన రాష్ట్రంలో ఒక పెద్ద ఓటు బ్యాంకు తాయిలం! ఇది రైతులకి మంచి చేస్తుంది అనేది పక్కన పెట్టి దీని వలనా ఏర్పడే సామజిక లాభాలు, మార్పులు, ఇబ్బందులు, నష్టాలు పరిసిలిద్దాం!

మొత్తం దేశంలో 2009లో Rs 67వేల కోట్లు వున్న  రైతుల రుణలు 2014లో సుమారుగా రెండు లేక మూడు రెట్లు పెరిగి వుంటాయి. కానీ మన ర2009లో Rs 11,000 కోట్లు వున్న  రైతుల రుణలు 2014లో సుమారు Rs 1,00,000 కోట్లకి చేరుకున్నాయి. అంటే రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాలలో ఇన్ని రెట్లు అభివృద్ధి చెందినదా? 
దీని అర్థం ఏమిటంటే 2009కి ముందు 


  • సక్రమంగా చెల్లించేవారు కూడా చెల్లించటం ఆపి వేశారు.
  • బ్యాంకు లోనూలంటే భయపడే వారు కూడా లోనులు తీసుకొన్నారు.
  • రుణ మాఫీ వుంటుందని ప్రకటించక వీలైనంత ఎక్కువగా లోనులు తీసుకొన్నారు.
అంటే రైతులని మరింత బద్ధకస్తులని చేశారు,  లోనులు తీసుకొని దాని మీద బ్రతికేయోచ్చని ఆలోచించేలా చేశారు. లోనులు తీసుకొని కట్టకుండా వుండెందుకు ప్రేరేపించారు. ఈ రైతుల రుణ మాఫీ నిజంగా నిజమైన రైతులకి వుపయోగ పడుతుందా, దీని వలన ఎవరికి లాభం కలుగుతోంది.

ఎవరిదాకో ఎందుకు మావురినే తిసుకొందం, పది ఎకరాలు అంతకన్నా ఎక్కువ వున్న వారు, వారి పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నవారూ, పిల్లల దగ్గర టౌన్లలో వుంటున్న వారూ, పిల్లల చదువులకై టౌన్లకూ వెళ్లినవారు, ఎవ్వరు సొంతగా వ్యవసాయం చెయ్యటం లేదు. వీళ్ళందరూ కౌలుకి ఇచ్చిన వారే కానీ అందరు రైతులాగ లోనులు తీసుకొన్న వారే! అది కాక మన కౌలు చట్టాలు గట్టిగ వున్నయో, వాటి వలనా భూస్వామికి లాభం లేక పోవటం, భూస్వామి  కౌలుదారుని కన్నా గట్టిగ వుండటం, ముందస్తు కౌలు తీసుకోవటం వలనా ఎటువంటి వ్రాత పూర్వక ఆదారాలు వుండటం లేదు. బ్యాంకులు కౌలుదారుని గుర్తించటం కానీ, రుణాలు ఇవ్వటానికి గాని కుదరటం లేదు.

మా బాబాయినే తీసుకొంటే మూడు ఎకరాల చిన్నకారు రైతు, లోనూలంటే భయం, తీసుకొన్నసమయానికి చెల్లించేవాడు. అలాంటిది 2009ది తర్వాత చెల్లించటం మానేశాడు. కారణం ఏదొక  సమయంలో రుణ మాఫీ వుంటుందని ఈ సారి మోసపోకుదని చెప్పాడు. దీనిలో మోసపోవటానికి ఏముందీ? అని అంటే అయన చెప్పిన విషయాలు
వూరిలో నలుగురు, ఐదుగురు పెద్ద రైతుల పేర్లు చెప్పి వాళ్ళకి లక్ష్యాలలో రుణలు మాఫీఅయ్యాయని , ఇంటిముందు వాళ్ళని చూపించి వాల్లకి రెండు లక్షలు మాఫీ అయ్యాయని వాళ్ళు లోను కట్టటానికి వుంచుకొన్న డబ్బూతొ డబుల్కట్ మంచం, ఫ్రిజ్, ఇన్వేర్టర్ తెచ్చు కున్నారని, అదే డబ్బూ సంపాదించాలంటే పంటలు బాగా పండిన రెండు సంవత్సరాలు పడుతుందని, అయన సక్రమంగా కట్టినందుకు కేవలం ఐదు వేలు ఇచ్చారని చెప్పాడు. 
ఇంకో  విషయం ఏమిటంటే ఒక సారి బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి లోయన్ కట్టమని, కట్టకపోతే పేర్లు పేపర్ లో వేస్తామని, తర్వాత వేలం ఇస్తామని చెప్పారని తెలిసినది. అప్పుడు అయన చెప్పినది ఏమిటంటే అయన రెండు సంవత్సరాలనుండే కట్టలేదని, ఉరిలో చాల మంది నాలుగు సంవత్సరాల నుండి కట్టలేదని, అది కాక బ్యాంకు వాళ్ళు పెద్ద వాళ్ళ జోలికి వెళ్లారని, వెళ్ళిన వాళ్ళు వెంటనే లాయర్ని కలసి కోర్టు నుంచి నోటిసు పంపిఅపుతారని చెప్పుకొచ్చాడు. బ్యాంకు వాళ్ళు చిన్నకారు రైతుల మిదనే ఎక్కువ వత్తిడి తెచ్చి కట్టిన్చుకుంటారని, వాళ్లకి లాయర్లు, కోర్టులు తెలియవు కనుక బయపడి కట్టేస్తారని చెప్పాడు. ఈ సారి చాల కొద్ది మంది కట్టారని, చిన్న రైతులు కూడా లాయర్లను కలసి నోటీసు పంపించి ఆపారని చెప్పాడు.
  • కష్టపడి  కౌలు చేసే రైతులకు ఎవిదమైన ఉపయోగం లేదు.
  • మంచిగా కష్టపడి ఋణాలు చెల్లించే  రైతులకు ఎవిదమైన ఉపయోగం లేదు. 
  • కౌలు కిచ్చే భుస్వములు లబ్ది పొందుతున్నారు.
  • ఎంత ఎక్కువ పొలం వుంటే అంత ఎక్కువ లబ్ది పొందు తున్నారు. 
 ఎక్కువ పొలం వున్నవాడు నష్ట పోవటం అనేది చాల అరుదు, వేరు వేరు పంటలు పండిచటం వలనా ఒకదానిలో నష్టపోయిన మరొకటి దానిని సర్దుబాటు చేస్తుంది. ఒకవేళ నిజంగా నష్టం వచ్చిన తట్టుకునే శక్తీ వుంటుంది. 
చివరిగా  మా బాబాయే గెలిచాడు, రుణలు మాఫీ అవుతున్నాయి.

  ఇది అందరు చెప్పే సమేత "ఇవి మంచి/ నీతి గల వారికి రోజులు కావు" అనే దానికి ఉదాహరణ.
 అది సామాన్యులు కూడా నేర్చుకునేలా చేస్తున్నారు, ఈ రాజకీయా నాయకులు.
దీని  నుండి తెలిసిన దేమిటంటే, ఈ రుణ మాఫీ అవసరమైన వాళ్ళకంటే, ఆవసరం లేని బలిసిన రైతులకే ఎక్కువ లబ్ది చేకూర్చుతుంది. ఇప్పుడు 15% వరకు లోనులు కట్టారని అంచనా, 2019 వరకూ 100% రైతులెవరు లోనులు కట్టారు. ఎవరోకరు వస్తారు రుణ మాఫీ చేస్తారని, చేసేవడికే ఓటు వేద్దామని కూర్చుంటారు.  

బ్యాంకులు చాల రుణాలిచ్చి అవి NPAs(మొండి బకాయిలు) గా మారి మని రోటేసన్ లేక ఎక్కవ లోనులు ఇవ్వటానికి ఇష్టపడవు. అందు వలన నిజాంగా లోనూ కావలిసిన వారికీ లోనులు ఇవ్వరు. ఇప్పుడు ఇచ్చే గవర్నమెంటు బాండుల వలనా మొండి బకాయిలు అన్ని రికవర్ అయిన, మళ్ళి లోనులు ఇచ్చేందుకు బ్యాంకుల దగ్గర డబ్బూ వుండదు. ఇప్పటికే  బ్యాకింగ్ రంగం రాష్ట్రంలో చాల కుంటు పడింది, వచ్చే ఐదు సంవత్సరాలలో ఎంత హీన స్థితికి చేరుతుందో చూడాలి.

రాజకీయా  నాయకులు రుణ మాఫీ పక్కన పెట్టి, పంటకూ మద్దతూ దర ఇప్పించటం, అవసరమైతే ప్రభుత్వమే కొనటం లాంటివి చెయ్యాలి. సహజవిపత్తుల నుండి నిజంగా పంట పోయినా వారిని అదుకోవలి గాని, ఇలా రుణ మాఫీ పేరుతో రాష్ట్ర అబివృద్దిని కుంటూ పరుస్తూ, రైతులని చేడ కొట్టవద్దని నా మనవి!

మీ
సత్భోగి 
12th  June 2014

1 కామెంట్‌: