12, జూన్ 2014, గురువారం

మన కొత్త రాజధాని ఎక్కడ వుండాలి - ఎలా వుండాలి

 ఈ మద్య బాగా వార్తలలో వేడెక్కిన విషయం మన కొత్త రాష్ట్ర రాజధాని ఎక్కడ వుండాలి? ఎలా వుండాలి? అనే విషయం. మన దూరదర్శన్ (న్యూస్ చానల్స్) మరియు అంతర్జాలం లోనూ అతిగా కనిపిస్తున్న విషయం ఇది. మనకి ఇప్పుడు అతర్జాతియ నగరం కన్నా అంతర్జాతీయ రాష్టం కావలి. అర్ధశతాబ్దం ఎంతో కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ నగరం మన చేతుల నుంచి పోయింది. గతం గతః అని వదిలి వేస్తే, ఇప్పుడు మనం అలోచిన్చాలిసింది కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి అనే దాని గురించి. కానీ మన గతం నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటంటే కేంద్రికృతా అభివృద్ది వలెన లాభలు కంటే నస్టాలే ఎక్కువగా కానిపిస్తున్నాయి. రోజు రోజుకి మెట్రోపలిటన్ నగరాలూ సామాన్య జనజీవనానికి, ప్రభుత్వా కార్యకలాపాలకు చాల అసౌకర్యాలనూ కలిగిస్తున్నాయి. కావున రాజధాని అన్ని విదాల అభివృద్ధి చేయాలను కోవటం అనవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే నిలయం కావలి కానీ, అన్నింటికి అదే నిలయం కాకూడదు. మన గత రాజదానినే తీసుకొంటే అన్ని జాతీయ సంస్థలు, పోలీసు, మిలటరీ, రాజధాని, విద్యాసంస్థలు, ఉద్యోగాలు అవకాశాలు అన్ని అక్కడే వున్నాయి. అందువలన అక్కడ విద్యకానీ, రవాణకానీ, నిత్యావసరాలు కానీ చాల వ్యాయప్రయాసలతో నిండినవి.
ప్రస్తుత సంవత్సర కాలుష్య సంచిని గమనిస్తే మన అన్ని మెట్రోపలిటన్ నగరాలు వున్నాయి, ఈ మద్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన వార్త ఏమిటంటే మన దేశా రాజధాని అయిన డిల్లి కాలుష్యంలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో వుంది. హైదరాబాద్ బెంగలూరు కన్నా ముందు వుంది, విశాకపట్టణం హైదరాబాదుతొ సమానంగా వుంది. విజయవాడ వీటి తర్వాత కొన్ని స్థానల వెనుక వుంది. మరి కొన్ని రోజులలో అక్షిజెన్ కొనుక్కొనే పరిస్థితి వస్తుంది మెట్రోపలిటన్ నగరాలలో. ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చాల అవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే తప్ప, అభివృద్ధికి నెలవు కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయినా బాద వున్నా అన్ని శుభ సూచికలే కానిపిస్తున్నాయి. మన అదృష్టం కొద్ది అభివృద్దే ధ్యేయంగా సాగే ముక్యమంత్రి, అయనకి అనువైన కేంద్రప్రభుత్వం, రెండు చోట్ల దృడమైన ప్రభుత్వాలు, మన రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు, పెట్టుబడులు పెడుతమంటున్న పెట్టుబడి దారులు, ఇలా ఎన్నెన్నో అనుకుల విషయాలు.
చాల మంది కండిచే విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం. మన జిల్లాల దగ్గర నుంచి రాష్ట్ర, దేశ, విదేశ రాజదాణుల వరకూ ఎక్కువ శాతం ఒక పక్కన వున్నాయి. అందు వలనా మనం ఏదో ఒక పక్కన పెట్టు కోవలిసిన ఆవసరం లేదు. మన దేశంనే తీసుకోండి డిల్లి లో వుంది. రుచి చూడని మావిడి పుల్లన అని. మనమేక్కడో వుండి, డిల్లికి దగ్గరగా వుండే రాష్ట్రల ఉపయోగాలు ప్రయోజనాలను గుర్తించలేక పోతున్నారు. ఈ మద్య మద్యప్రదేశ్ లోని రైతులు గ్వాలియర్ నుంచి డిల్లిలో వాళ్ళ నిరసన తెలపటానికి బయలుదేరారని తెలిసిన వెంటనే వారితో చర్చలు జరిపి వెనుకకు పంపింది ప్రభుత్వం. డిల్లి నుంచి గ్వాలియర్కి ఐదు గంటల ప్రయాణం. మనకు ఒకరోజు ప్రయాణం అదే కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకి రెండు రోజుల ప్రయాణం. వారు ఒక వేళ బయలు దేరారని తెలిసిన ప్రభుత్వం దగ్గర రెండు రోజుల సమయం వుంటుంది. దక్షిణభారతం మీద చిన్న చూపు అనే విషయం అందు వలెనే వచిందేమో? మన జిల్లాకేంద్రాలనే తీసుకోండి మనకు చాల తక్కువ అవసరాలు వుంటాయి. నా చిన్నప్పుడు బస్సు పాస్ రెన్యువల్ చేసుకోవటానికి, నెలకి ఒక రోజు స్కూలుకి సెలవు పెట్టి మరి వెల్ల వలసి వచ్చేది, అదే మద్యలో వుంటే నాకు సెలవు పెట్టవలసిన ఆవసరం వుండేది కాదు.
దీనినుంచి గ్రహించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని దూరమైయ్యే కొద్ది కొన్ని జిల్లాలు తెలియని నష్టాలకి గురవుతాయి.  కనుక రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం మనం గ్రహించాలి. కానీ అది అన్ని విదాలుగా అభివృద్ది చెందాలనే ఆవసరం లేదు. మళ్ళి డిల్లినే తీసుకోండి. అది మన దేశరాజధానే కానీ, అన్ని రంగలలో అగ్రగామి కాదు. బొంబాయి ఆర్ధిక పరంగా, బెంగలూరు ఐటి రంగం లోనూ, చెన్నయ్ బ్యాంకింగ్ లోనూ, కలకత్తా ఎగుమతి/దిగుమతికి ఇంక ఎన్నో నాగరాలు వాటి వాటి ప్రత్యేకతలను బట్టి అగ్రగాములుగా నిలిచాయి. కానీ ఇవన్ని ఆ రాష్ట్రల రాజదాణులు అవటం వలనా అస్తఃవ్యస్తంగా తాయరయ్యాయి. గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకొంటే హైదరాబాద్ లాంటి సిటీ లేక పోయినా దేశంలో ముందంజలో వుంది. మన దేశంలో ప్రదానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహానగరాలు వెటికి ఒక ప్రణాళిక లేదు, మన నాయకులకి ఒక విజన్ లేదు. నా ఐదు సంవత్సరాలు నేను ఎలా కోలా నెట్టు కొచ్చి, అంత బాగుంటే మళ్ళి ఇంకో ఐదు సంవత్సరాలు పాలించటానికి ఏవో తాయిలాలు ఇచ్చి గెలుద్దమనే కానీ, ప్రజలనూ బాగాస్వములను చేసి వారికీ అర్థం అయ్యేలా చెప్పి ఒక ప్రణాళిక ప్రకారమ్, ఒక వేల ప్రతిపక్షాలు వచ్చిన వాటితో ఆ విజన్ ని ఎలా చేరుకోవలనేది ఎవరు ఆలోచించటం లేదు. రాజకీయాలు వదిలేద్దాం! రాజధానికి వద్దాం!

కనుక రాజధానికి అంతర్జాతీయ విమనశ్రయలు కానీ, అంతర్జాతీయ నగరాలు కానీ ఆవసరం లేదు కానీ అందరికి అందుబాటులో వుండాలి. దీనిని పరిగణలోకి తీసుకొని మన ముక్యమంత్రి గారు అనుకొంటున్న రాజధాని నగరం బౌగోలికంగా మద్యలోనే వున్నది కనుక దీనిని మనం రాజదానిగా అంగికరించ వచ్చును. కానీ అయన అంటున్న అన్ని అభివృద్ది కార్యక్రమాలు అనగా ఐటి హబ్ లు, SEZలు, ఇతర పరిశ్రమలు లాంటివి ఇక్కడే నెలకొల్పాలను కోవటం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడూ అనుకొంటున్న ప్రాంతంలోని భు విలువలు రాష్ట్రం ప్రకటించక ముందే ఆకాశాన్ని తాకుతున్నాయి. అది కాక ఈ జిల్లాలు వ్యవసాయ పరంగా చాల ముందు వున్నాయి.  ఈ ప్రాంతంలో రాజధాని వరకూ సరే గాని మెట్రోపోలిటన్ నగరాలకూ దీటుగా చెయ్యాలనే కోరికతో బంగారం పండించే భూమిని అభివృద్దిపేరుతో నాశనం చెయ్యొద్దని నా మనవి. మాకు ఒక మెట్రోపలిటన్ నగరం కన్నా అన్ని జిల్లాలు ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తూ, రెండవ తరగతి నగరాలుగా వున్న, మొత్తంగా రాష్ట్రం ముందంజలో వుండాలని కోరుకుంటూ సెలవు తీసుకొంటున్నాను.

మీ
సత్భోగి
13th June 2014

ఆంద్రప్రదేశ్(సీమాంద్రకి) కాకుండా కొత్త పేరు అవసరమా?

నేను ఈ మద్య వార్తలు చూస్తుంటే ఇంటిలిజేన్సియా పేరుతో న్యూస్ చానల్స్ అన్ని ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ అంటే దానిలోతప్పు ఏముందో తెలియటం లేదు. ఆంద్రప్రదేశ్ ఆంద్రులు నివసించే ప్రదేశం. ఇంత మంచి పేరుని మార్చటం అవసరమా? కేంద్రం పేరు మార్చటానికి కూడా అధికారం ఇవ్వటం లేదని ప్రచారం చేస్తున్నాయి.
ఇంటిలిజేన్సియా పేరుతో చాలా గొప్ప సలహాలు ఇస్తున్నారు, సీమాంద్ర అని, తెలుగునాడు, తెలుగు రాష్ట్రం అని, ఆంధ్రరాష్ట్రం అని ఇలా ఎన్నెన్నో పేర్లు.

వీళ్ళకి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ప్రదేశ్ హిందీ లేక సంస్కృతం అంటా? దీని వలనా తెలుగు అస్థిత్వం దేబ్బతింటూదని చెబుతున్నారు. అంటే అదిఇప్పటివరకు గుర్తు రాలేదా? విల్లంత ఇంతకి ముందు ఏమిచేసారు? హైదారాబాద్, వైజాగ్ ఇవన్ని తెలుగు పేరులా?

మన పేరో, ఇంటి పేరో, ఉరు పేరో బాగోలేదని మార్చేస్తామా? అల అయితే భవిష్యత్ తరాలకి ఈ పేరు నచ్చక వేరే పేరు పెట్టుకుంటారు. ఇప్పటికే చాల నగరాలకి చరిత్రలో ఒక పేరుంటుంది, మనం ఇప్పుడు వేరే పేరుతో పిలుస్తుంటాము. వాటిని అర్ధం చేసుకోలేక వాటిని ఆ చరిత్రాని మన ప్రాంతాలకు అన్వయిన్చుకోలేక చాల మందికి చరిత్ర అంటేనే విసుగు పుట్టించే విషయం అయింది.

మన  రాష్ట్రం ఆంద్రప్రదేశగా దేశంలో, ప్రపంచం మొత్తంలో చాల మదికి సుపరిచితం, ఇంతక ముందు డిల్లి వెళ్తే మాది తమిళ్ కాదు తెలుగు అని, ఆంధ్రాప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటుందని, దానిలో తెలుగు మాట్లాడతరాని చెప్పుకోవలిసి వచ్చేది. ఇప్పుడు మన ఈ తరం ప్రజలు, నాయకులు ఆంధ్రాప్రదేశ్ ఉనికిని దేశంలో, ప్రపంచంలో చాటి చెప్పారు. ఇప్పుడు మళ్ళి పేరు మార్చి మళ్ళి భావితారల వారు ఆ రాష్ట్రంమా ఇదుగో ఇది చరిత్ర అని చెప్పుకోవలిసిన పరిస్థితి తేకండి. ఆదిగాక ఇంతకముందు మనం ఎనిమిది కోట్లు ఇప్పుడూ ఐదు కోట్లు మన ఉనికిని చాటలంటే చాల కష్టపడాలి. ఆ బాధని తెలంగాణాకి వదిలేసి రాష్ట్రంని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించండి.

ఆంద్రప్రదేశ్ ఒక విధంగా మన దేశం భిన్నత్వం లో ఏకత్వం అని తెలియ చెప్పే పేరు అది. మనం అంత ఒకటే అనే భావాన్ని కలుగ చేస్తుంది. వీళ్ళకి(ఇంటిలిజేన్సియా) మైకు ఇస్తే తెలంగాణ వాళ్ళు తెలంగాణ తల్లిని పెట్టుకున్నారు. మనకేందూకి ఇద్దరి తల్లి తెలుగు తల్లి, కొత్త తల్లిని పెట్టుకుందామని అంటారు. తెలంగాణ గీతంలాగానే మా తెలుగుతల్లిని వదిలేసి వేరే గీతం పాడుకుందాం అంటారు.

తెలంగాణ వాళ్ళు విడిపోయినా ఒక పెద్దగ మన సౌభ్రాతృత్వంని మనం కాపాడుకుంటూ, ఆంద్రప్రదేశ్ పేరునే వుంచుకుందాం, మా తెలుగుతల్లినే పాడుకుంటూ మనమంత తెలుగు వారిమేనని గుర్తు చేస్తూ, మనం ఎప్పుడూ తెలుగు వారి మంచినే కోరుకుంటామని చెబుదాం. ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిచి ఎక్కడైన మేము అభివృద్ధిచేయగలమని, తెలంగణకి మంచే చేసాం కానీ చెడు చేయలేదని నిరూపిద్దాం.

జై ఆంద్రప్రదేశ్! జై జై ఆంద్రప్రదేశ్!!

మీ
సత్భోగి
12th June 2014

11, జూన్ 2014, బుధవారం

రైతుల రుణ మాఫీ - మంచిదా ? కాదా?

రైతుల రుణ మాఫీ, మన రాష్ట్రంలో ఒక పెద్ద ఓటు బ్యాంకు తాయిలం! ఇది రైతులకి మంచి చేస్తుంది అనేది పక్కన పెట్టి దీని వలనా ఏర్పడే సామజిక లాభాలు, మార్పులు, ఇబ్బందులు, నష్టాలు పరిసిలిద్దాం!

మొత్తం దేశంలో 2009లో Rs 67వేల కోట్లు వున్న  రైతుల రుణలు 2014లో సుమారుగా రెండు లేక మూడు రెట్లు పెరిగి వుంటాయి. కానీ మన ర2009లో Rs 11,000 కోట్లు వున్న  రైతుల రుణలు 2014లో సుమారు Rs 1,00,000 కోట్లకి చేరుకున్నాయి. అంటే రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాలలో ఇన్ని రెట్లు అభివృద్ధి చెందినదా? 
దీని అర్థం ఏమిటంటే 2009కి ముందు 


  • సక్రమంగా చెల్లించేవారు కూడా చెల్లించటం ఆపి వేశారు.
  • బ్యాంకు లోనూలంటే భయపడే వారు కూడా లోనులు తీసుకొన్నారు.
  • రుణ మాఫీ వుంటుందని ప్రకటించక వీలైనంత ఎక్కువగా లోనులు తీసుకొన్నారు.
అంటే రైతులని మరింత బద్ధకస్తులని చేశారు,  లోనులు తీసుకొని దాని మీద బ్రతికేయోచ్చని ఆలోచించేలా చేశారు. లోనులు తీసుకొని కట్టకుండా వుండెందుకు ప్రేరేపించారు. ఈ రైతుల రుణ మాఫీ నిజంగా నిజమైన రైతులకి వుపయోగ పడుతుందా, దీని వలన ఎవరికి లాభం కలుగుతోంది.

ఎవరిదాకో ఎందుకు మావురినే తిసుకొందం, పది ఎకరాలు అంతకన్నా ఎక్కువ వున్న వారు, వారి పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నవారూ, పిల్లల దగ్గర టౌన్లలో వుంటున్న వారూ, పిల్లల చదువులకై టౌన్లకూ వెళ్లినవారు, ఎవ్వరు సొంతగా వ్యవసాయం చెయ్యటం లేదు. వీళ్ళందరూ కౌలుకి ఇచ్చిన వారే కానీ అందరు రైతులాగ లోనులు తీసుకొన్న వారే! అది కాక మన కౌలు చట్టాలు గట్టిగ వున్నయో, వాటి వలనా భూస్వామికి లాభం లేక పోవటం, భూస్వామి  కౌలుదారుని కన్నా గట్టిగ వుండటం, ముందస్తు కౌలు తీసుకోవటం వలనా ఎటువంటి వ్రాత పూర్వక ఆదారాలు వుండటం లేదు. బ్యాంకులు కౌలుదారుని గుర్తించటం కానీ, రుణాలు ఇవ్వటానికి గాని కుదరటం లేదు.

మా బాబాయినే తీసుకొంటే మూడు ఎకరాల చిన్నకారు రైతు, లోనూలంటే భయం, తీసుకొన్నసమయానికి చెల్లించేవాడు. అలాంటిది 2009ది తర్వాత చెల్లించటం మానేశాడు. కారణం ఏదొక  సమయంలో రుణ మాఫీ వుంటుందని ఈ సారి మోసపోకుదని చెప్పాడు. దీనిలో మోసపోవటానికి ఏముందీ? అని అంటే అయన చెప్పిన విషయాలు
వూరిలో నలుగురు, ఐదుగురు పెద్ద రైతుల పేర్లు చెప్పి వాళ్ళకి లక్ష్యాలలో రుణలు మాఫీఅయ్యాయని , ఇంటిముందు వాళ్ళని చూపించి వాల్లకి రెండు లక్షలు మాఫీ అయ్యాయని వాళ్ళు లోను కట్టటానికి వుంచుకొన్న డబ్బూతొ డబుల్కట్ మంచం, ఫ్రిజ్, ఇన్వేర్టర్ తెచ్చు కున్నారని, అదే డబ్బూ సంపాదించాలంటే పంటలు బాగా పండిన రెండు సంవత్సరాలు పడుతుందని, అయన సక్రమంగా కట్టినందుకు కేవలం ఐదు వేలు ఇచ్చారని చెప్పాడు. 
ఇంకో  విషయం ఏమిటంటే ఒక సారి బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి లోయన్ కట్టమని, కట్టకపోతే పేర్లు పేపర్ లో వేస్తామని, తర్వాత వేలం ఇస్తామని చెప్పారని తెలిసినది. అప్పుడు అయన చెప్పినది ఏమిటంటే అయన రెండు సంవత్సరాలనుండే కట్టలేదని, ఉరిలో చాల మంది నాలుగు సంవత్సరాల నుండి కట్టలేదని, అది కాక బ్యాంకు వాళ్ళు పెద్ద వాళ్ళ జోలికి వెళ్లారని, వెళ్ళిన వాళ్ళు వెంటనే లాయర్ని కలసి కోర్టు నుంచి నోటిసు పంపిఅపుతారని చెప్పుకొచ్చాడు. బ్యాంకు వాళ్ళు చిన్నకారు రైతుల మిదనే ఎక్కువ వత్తిడి తెచ్చి కట్టిన్చుకుంటారని, వాళ్లకి లాయర్లు, కోర్టులు తెలియవు కనుక బయపడి కట్టేస్తారని చెప్పాడు. ఈ సారి చాల కొద్ది మంది కట్టారని, చిన్న రైతులు కూడా లాయర్లను కలసి నోటీసు పంపించి ఆపారని చెప్పాడు.
  • కష్టపడి  కౌలు చేసే రైతులకు ఎవిదమైన ఉపయోగం లేదు.
  • మంచిగా కష్టపడి ఋణాలు చెల్లించే  రైతులకు ఎవిదమైన ఉపయోగం లేదు. 
  • కౌలు కిచ్చే భుస్వములు లబ్ది పొందుతున్నారు.
  • ఎంత ఎక్కువ పొలం వుంటే అంత ఎక్కువ లబ్ది పొందు తున్నారు. 
 ఎక్కువ పొలం వున్నవాడు నష్ట పోవటం అనేది చాల అరుదు, వేరు వేరు పంటలు పండిచటం వలనా ఒకదానిలో నష్టపోయిన మరొకటి దానిని సర్దుబాటు చేస్తుంది. ఒకవేళ నిజంగా నష్టం వచ్చిన తట్టుకునే శక్తీ వుంటుంది. 
చివరిగా  మా బాబాయే గెలిచాడు, రుణలు మాఫీ అవుతున్నాయి.

  ఇది అందరు చెప్పే సమేత "ఇవి మంచి/ నీతి గల వారికి రోజులు కావు" అనే దానికి ఉదాహరణ.
 అది సామాన్యులు కూడా నేర్చుకునేలా చేస్తున్నారు, ఈ రాజకీయా నాయకులు.
దీని  నుండి తెలిసిన దేమిటంటే, ఈ రుణ మాఫీ అవసరమైన వాళ్ళకంటే, ఆవసరం లేని బలిసిన రైతులకే ఎక్కువ లబ్ది చేకూర్చుతుంది. ఇప్పుడు 15% వరకు లోనులు కట్టారని అంచనా, 2019 వరకూ 100% రైతులెవరు లోనులు కట్టారు. ఎవరోకరు వస్తారు రుణ మాఫీ చేస్తారని, చేసేవడికే ఓటు వేద్దామని కూర్చుంటారు.  

బ్యాంకులు చాల రుణాలిచ్చి అవి NPAs(మొండి బకాయిలు) గా మారి మని రోటేసన్ లేక ఎక్కవ లోనులు ఇవ్వటానికి ఇష్టపడవు. అందు వలన నిజాంగా లోనూ కావలిసిన వారికీ లోనులు ఇవ్వరు. ఇప్పుడు ఇచ్చే గవర్నమెంటు బాండుల వలనా మొండి బకాయిలు అన్ని రికవర్ అయిన, మళ్ళి లోనులు ఇచ్చేందుకు బ్యాంకుల దగ్గర డబ్బూ వుండదు. ఇప్పటికే  బ్యాకింగ్ రంగం రాష్ట్రంలో చాల కుంటు పడింది, వచ్చే ఐదు సంవత్సరాలలో ఎంత హీన స్థితికి చేరుతుందో చూడాలి.

రాజకీయా  నాయకులు రుణ మాఫీ పక్కన పెట్టి, పంటకూ మద్దతూ దర ఇప్పించటం, అవసరమైతే ప్రభుత్వమే కొనటం లాంటివి చెయ్యాలి. సహజవిపత్తుల నుండి నిజంగా పంట పోయినా వారిని అదుకోవలి గాని, ఇలా రుణ మాఫీ పేరుతో రాష్ట్ర అబివృద్దిని కుంటూ పరుస్తూ, రైతులని చేడ కొట్టవద్దని నా మనవి!

మీ
సత్భోగి 
12th  June 2014

ప్రత్యేక తెలంగాణమా - సమైక్య ఆంధ్రమా

2001 లో KCR ప్రత్యేక తెలంగాణ కోసం రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు నాలో నేను నవ్వుకున్నాను. ఒక వ్యక్తి స్వాప్రయోజనాల కోసం, ఒక రాష్ట్ర ప్రజలను విడగొట్టాలేడను కున్నాను. నేను ఏన్నీ విధాలుగా ఆలోచించినా తెలంగాణా విభజన సామాన్యాప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్థం కాలేదు. నేను హైదరాబాద్ లో చదవటం వలన నా స్నేహితులు అందరు తెలంగాణ వల్లే వున్నారు, ఏన్నో సార్లు ఈ విషయం మీద చర్చలు జరిగేవి. నేను ఆంధ్రావాడినవ్వటం వలన నేనెప్పుడు సమైక్య వాధినే, కాని మిగతా వాళ్ళందరు తెలంగాణ వాళ్ళే, తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి వున్నారు. కాని ఈ చర్చా వాల్ల మాద్యనే ఎక్కువగా జరిగేది, ఏప్పుడు తెలంగాణ వచ్చినట్లయితే ఉద్యోగాలూ,  ఉద్యోగాఅవకాశాలు పెరుగుతాయని చెప్పటమే కాని కచ్చితంగా ఎలా పెరుగుతాయో తెలియదు. గావర్నమెంటు  ఉద్యోగాలలో అన్యాయం జరిగుతుంది అని చెప్తారే కాని, దానికి ప్రతేక రాష్టమే జవాబు కాదు. వారిలోనే సగం కన్నా ఎక్కువ సమైక్యనికే మద్దతూ పలికేవారు.

తెలంగాణకి మద్దతు ఇస్తున్నా నాయకులందరూ ఏ GO అయితే అమలు చెయ్యటం లేదో దాని అమలు కోసం ప్రయాత్నిస్తే సరిపోతుంది. కాని అది ఎవ్వరికి ఆవసరం రాలేదు. ఎందుకంటే అది అప్పుడు ఓటు బ్యాంకుని ప్రభావితం చెయ్యని విషయం. సామాన్యాప్రజనికానికి ఆ GO ఏమిటో కూడా తెలీదు, అది వారికి ఎలా ఉపయోగ పడుతుందో కూడా తెలీదు. అది తెలిసిన విద్యార్ది, ఉద్యోగ సంగాలు ప్రయత్నించి, ప్రయత్నించి విసిగి వెసారి పోయాయి, సరైన రాజకీయా మద్దతూ లేకపోవటం వలన. అదే సమయంలో TRS పార్టీ అవిర్భావం వాటికి మళ్ళి కొత్త ఉపిరీ పోశాయి. ప్రతేక రాష్టమే ఏర్పడితే GOలతొ పని ఏముందీ, ఒకవేళ ప్రతేక రాష్టము ఏర్పడక పోయినా కచ్చితంగా కొన్ని కొత్త GOలు, కొన్ని అభివృద్ధి పనులు అయితే తప్పని సరిగా జరుగుతాయనే భావానతో తెలంగాణ విద్యార్ది, ఉద్యోగ సంగాలు ఏకగ్రీవంగా తెలంగాణకి(TRS) మద్దతూ పలికినాయి. ఇది TRS పార్టికి బాగా ఉపయోగాకరంగా మారింది, తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలూవస్తాయి, ఆంధ్రావాళ్ళని అందరిని పంపిచేస్తారు (private ఉద్యోగాల నుండి కుడా) అనే బ్రమలో వున్నవారు కుడా వున్నారంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణకి(TRS) ప్రాబల్యం పెరుగుతుండటం తొ ఇతర పార్టీలు కూడా తప్పనిసరి పరిస్తితుతలలో ప్రతేక రాష్టనికే మద్దతూ పలుకుతూ తెలంగాణలో వారి పట్టుసడలి పోకుండా ఉండటానికే చుసరే కానీ పరిష్కార మార్గాల కోసం ఏ పార్టి ప్రయత్నించలేదు అన్నది కనిపిస్తున్న సత్యం. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వాఉద్యోగల పరంగాగాని, నీటి వనరుల విషయంలో కానీ అన్యాయం జరిగిందనే విషయం అందరికి తెలిసినదే, అయిన ఏ పార్టి దాని గురించి చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఎవరైనా తెలంగాణకి న్యాయం చెయ్యాలంటే వారి ఆంధ్రా ఓటు బ్యాంకుకి చిల్లు పడుతుంది.  తెలంగాణ ఉద్యమ కారణాలు తెలిసిన అన్ని పార్టీలు ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. TRS ప్రాబల్యం పెరుగుతుండటం అన్ని పార్టీలు రెండు ప్రాంతాలలోఉనికిని కాపాడుకోవటానికి మద్దతూ పలికాయి.
వారి అందరి నమ్మకం ప్రత్యేక తెలంగాణ అనేది చాల కష్టతరమైన విషయం అది ఎప్పటికి సాధ్యమవ్వధనేది అందరి నమ్మకం.

2001లో ఏర్పడిన రాష్ట్రలను పరిశిలిస్తే విడిపోయిన ప్రతీ రాష్టంకు కొత్త రాజధాని ఇవ్వబడింది మరియు ఆ ప్రాంతం వెనుక పడి వుండటం వలన కొత్త రాజధాని ఏర్పాటుకు కర్చు చేసే డబ్బూ ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ తెలంగాణ విషయంలో ఇది సాధ్యపడదు, తెలంగాణతొ హైదరాబాదుని కలిపిచుస్తే అది వెనుక పడిన ప్రాంతం కిందకి రాదు. విభజన జరిగితే అభివృద్ధి చెందినది అయిన ఆంధ్రాకి కేంద్రాప్రభుత్వం సాయం చేయ్యాలి, రాజధాని ఏర్పాటుకై. అప్పుడు తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదు. ఇలా చాల కష్టతరమైన విషయాలతో కూడినది అవ్వటం వలన అటు తెలంగాణా ప్రజలు కానీ, ఆంధ్రా ప్రజలు కానీ ప్రత్యక రాష్ట్రం గురించిన అందోళన పడలేదు. పార్టీలు అన్ని ప్రతేక రాష్టనికే మద్దతూ పలుకుతున్న ఏ ప్రాంత నాయకులు వారి వాదలు పలుకుతూ వచ్చారు.
2009లో TRS ప్రాబల్యం తగ్గుతున్నా బావనతో KCR ఆమరణ నిరాహార దీక్షతొ కేంద్రాప్రభుత్వం అనలోచక నిర్ణయం ప్రకటించటం, సిమాంద్ర ప్రజలు ఆగ్రహానికి  మళ్ళి దానిని వెన్నక్కు తీసుకోలేక శ్రీకృష్ణ కమిటికి శ్రీకారం చుట్టటం, శ్రీకృష్ణ కమిటి ఏ విదమైన స్పష్టత ఇవ్వక లేకపోవటం, మరుగునపడల్సిన విషయం, తెలంగాణ ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారి దేశంలో అందరిని ఆకర్షించింది, రాష్ట్ర స్తిథి గతుల మీద సరిగా అవగాహనా లేని రాజకీయా నాయకులందరూ వారి రాజకీయా ప్రయోజానాల కోసం కానీ, సమైక్యా ఉధ్యమం అంటూ ప్రత్యకంగా లేక పోవటం వలనా గాని,  ప్రత్యేక తెలంగాణనే మొత్తం రాష్ట్ర ప్రజలా మనోభావం అనుకోవటం వలనా కానీ, దేశం లోని అన్ని పార్టీలు  ఒక విధంగా ప్రత్యేక తెలంగాణకి మద్దతూ తెలిపుతున్నాయి.

అదికార కాంగ్రెస్ పార్టి అనలోచితంగా గాని/ రాజకీయ ప్రయోజానాల దృశ్య ఆలోచితంగాకానీ రాష్ట్ర ప్రజలను కొట్టుకు చావమని, ఎటువంటి వివరణా లేని ప్రకటనా ఇచ్చి రాష్ట్ర ప్రజలనూ అల్లకోల్లలం చేసింది. దీనిలో అనలోచితంగా అనేకన్నా ఒక కుయుక్తి తొ తీసుకొన్న నిర్ణయం అంటేనే బాగుంటుంది. అటూ సిమంధ్ర లోనూ/ ఇటూ తెలంగాణ లోనూ ప్రజలు ప్రశాంతంగా లేరు అనే చెప్పవచ్చును.
నా వరకూ ప్రారంభ దశలో నేను సమైక్య ఆంధ్రకి ప్రాధాన్యత ఇచ్చిన, పరిస్థితులలో వచ్చిన మార్పులు, ప్రభుత్వం చేసినా అనాలోచిత ప్రకటనలు, రాజకీయ కుయుక్తులు, రాష్ట్ర స్థితి గతులను చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ ఇవ్వటం మంచిది అని నా అభిప్రాయం.

ఈవి కొన్ని పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు
  • ఇన్ని ప్రకటనల తర్వాత ప్రత్యేక తెలంగాణ ఇవ్వక పోతే తెలంగాణ ప్రజలా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ఆందోళనలు ఇంకా పెరిగి రాష్ట్ర అభివృద్ది ఇంకా కుంటుపడటానికి దోహదం చేస్తాయి.
  • ఇప్పుడు ఇవ్వక పోయినా ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా పార్టీలు వున్నంతవరకూ, ఈ బందులు, దీక్షలు ఆగవు, కనుక రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుంది, ఇది మనం గత పది సంవత్సరాలుగా చూస్తూనే వున్నాము. కొన్ని పార్టీలు ఈ అంశాన్ని ముక్య అజెండాగా చేసుకొని వుండటం వలనా ఇది ఇప్పటిలో సమసిపోయే సమస్య కాదు.
  • ఇప్పుడు  ఉన్న పరిస్థితుల దృష్ట్యా సమైక్యంగా వుంచిన రెండు ప్రాంతాల అభివృద్ది కుంటుపడుతుంది.
  •  హైదరాబాదును ఉమ్మడి రాజదాని చేసినా ఆంధ్రా ప్రజలకి గాని/ తెలంగాణ ప్రజలకి గాని ఎటువంటి ఉపయోగం లేదు. ఉమ్మడి రాజదాని అంటే దానిని కేంద్రపాలితప్రాంతం (UT) గా పరిగానిస్తారు. అందు వలన దాని మీద పాలన వచ్చే ఆదాయం ముక్య బాగం కేంద్రానికి చెందుతుంది.
  • అలకాక పోయినా వచ్చిన ఆదాయం రెండు రాష్ట్రలకు పంచ బడిన, దాని వలనా హైదరాబాదు అభివృద్ది కుంటుపడుతుంది. ఎవరికి వారే హైదరాబాదుకి ప్రాదాన్యం ఇవ్వరు.
  •  హైదరాబాదును ఉమ్మడి రాజదాని చేసి దానిని  కేంద్రపాలితప్రాంతం (UT) చేసినా లేక తెలంగాణాకి ఇచ్చినా సీమాంధ్రాకి నష్టం కలుగుతుంది. పాలనా ఒక చోట ప్రజలు ఒకచోట, విభజించినా అనివార్యమైనచో ప్రత్యక  రాజదాని ఏర్పాటు చేసుకొనుట అన్ని విధాల మంచిది.
  • ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లయితే కేంద్రప్రభుత్వం ఎంతా సహాయం చేసినా ప్రస్తుతానికి సీమాంధ్రా ప్రాంతం నష్టపోవటం అనేది కాయం. కానీ సమైక్యంగా వుండి భవిషత్తులో మళ్ళి ఇదే సమస్యతో విడి పోయేకన్నా ఇప్పుడే విడిపోయి సీమాంధ్రా ప్రాంతంన్నీ అభివృద్ది చేసుకోవటం ఉత్తమం.
  • ఇప్పుడు వున్న పరిస్తితులలో సీమాంధ్రా ప్రత్యక  రాజదాని ఎక్కడా పెట్టాలి అనేది మరో చిక్కూ ప్రశ్న. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కడ పెట్టినా ఒక పూర్తి జిల్లా లోని మంచి వ్యవసాయ భూములు నాశనం అవుతాయి. ఇది పర్యావరణకి సంబంధించిన విషయం. మొత్తం ఆంధ్రాప్రాంతంలో భువిలువలు ఎక్కువ వుండటం వలనా ప్రభుత్వా భావనలకే భూములు దొరుకుట కష్టం.
  • అలా  అని కర్నూలు, అనంతపురం, చిత్తూరులోనో లేక విశాకపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోనూ అన్ని ప్రాంతాల వారికీ అమోదయోగ్యం కాదు. ముడు ప్రాంతాల వారికి ఉత్తరాంద్ర, దక్షినాంద్ర, రాయలసీమ వాళ్ళకి అమోదకరం అయిన రాజదాని ఎంచుకోవాలి. రాజధాని విస్తరణకు, పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా వుండాలి.
  • సీమాంధ్రా ప్రజలా ప్రస్తుత భయం విభజన కాన్న కొత్త రాజదాని ఎక్కడా పెడతారా అని. సీమ ప్రజలు కర్నూలు లో కావాలని, ఆంధ్రా ప్రజలు విశాకపట్నం, విజయవాడ లేక గుంటూరులోనో కావాలని కాకుండా అందరికి బాగా ఉపయోగాపడే నిర్ణయం తీసుకోవాలి.
  • సీమాంధ్రా ప్రజలు అర్ధం చేసుకోవలిసినది ఏమిటంటే సమైక్యంగా వున్న, లేకున్న నష్టపోవటం అనేది కాయం, కనుక ఇప్పుడే విడి పోయి సాద్యమైనంత త్వరగా అభివృద్ది చేసుకోవటం. ఈ సారి అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా, సాద్యమైనన్ని అన్ని పట్టణాలను అభివృద్ది చేసుకోవటం, అభివృద్ధిని  వికేంద్రీకరించటం.
  • తెలంగాణ  ప్రస్తుతానికి లబ్ది పొందినా భవిషత్తులో అభివృద్ది మందగించే సూచనలు వున్నాయి. ఎలా అనగా ఇప్పటికే రియల్ ఎస్టేటు మందగించింది. ఇప్పటివరకు హైదరాబాదులో ఎక్కువ పారిశ్రామలు వున్నది ఆంధ్ర వారికే కనుక వారు వారి పెట్టుబడులను ఆంధ్రాకి మరల్చాటానికి ప్రయత్నిస్తారు.
  • ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లయితే ఇప్పటి వరకూ తెలంగాణనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొన్న రాజకీయా పార్టీలు ఉనికి కొల్పోతాయి, వాటి ఉనికిని నిలపెట్టుకోవటానికి మరికొన్ని ప్రాంతీయ వాదా ఉద్యమాలు మొదలు పెడతాయి. అవి అభివృద్దిని అడ్డుకుంటాయి.
కావున  సీమాంద్ర ప్రజలు సమైక్య ఆంధ్రని పట్టుకు వేలాడటం వాల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా వుంది అని గమనిచాలి.
  • అధికారికంగా కేంద్రప్రభుత్వం రెండు సార్లు ప్రకటనా చేసినందున అది పూర్తిగా వెనక్కు వెళ్లలేదు. కావున హైదరాబాదే ముక్య సమస్యాగా పరిగణించి కేంద్రపాలితప్రాంతం (UT) ఉమ్మడి రాజదానిగా కానీ/ ఇంకా ఎక్కువ సంవత్సరాలు రాజదానిగా కానీ/ తెలంగాణ లో వుంచి ఉమ్మడి రాజదానిగా కానీ చేస్తుంది. దాని వలనా ఎటువంటి ఉపయోగం లేదు.
  • ఇప్పుడు  సమైక్య ఆంధ్ర కొసం కన్నా కేంద్రప్రభుత్వం నుంచి విలయినంత ఎక్కువ ప్యాకేజిని సీమంధ్ర  రాజదానిని ఏర్పాటు చేసుకోవటానికివచ్చే విధంగా కృషి చెయ్యాలి.
  • కేంద్రప్రభుత్వం నుంచి విలయినన్నీ కేంద్ర సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటయ్యే విదంగా కృషి చెయ్యాలి.. అనగా  IIT, NIT, IIM, DRDO, CSRI, CARI, BHEL, NTPC, AIIMS, central university వంటి విద్య సంస్థలు, పరిశోధన ల్యాబ్ లు ప్రభుత్వా రంగా  సంస్థలు, నౌకశ్రాయలు, విమానాశ్రయాలు మొదలైనవి.
  • విద్యుత్తు, నది జలాలు విభజన, భవిష్యతు ప్రణాళికలు, తది తర అంశాల మీద క్షున్నంగా చర్చలు జరిపి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు, అగ్రిమెంట్లు చేసుకోవాలి. 
  • రాజదాని ఏర్పాటుకి నగరం, రాయల సీమాకూ ఆంధ్రకు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు, అగ్రిమెంట్లు చేసుకోవాలి.
  •  మంచి పాలనాతో చిన్న రాష్ట్రాలు ఎక్కువ వృద్ది రేటుతొ అభివృద్ది చెందగాలవు. అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా, సాద్యమైనన్ని అన్ని పట్టణాలను అభివృద్ది చేసుకోవటం, అభివృద్ధిని  వికేంద్రీకరించటం.
 మీ
సత్భోగి
10th may 2013