12, జూన్ 2014, గురువారం

మన కొత్త రాజధాని ఎక్కడ వుండాలి - ఎలా వుండాలి

 ఈ మద్య బాగా వార్తలలో వేడెక్కిన విషయం మన కొత్త రాష్ట్ర రాజధాని ఎక్కడ వుండాలి? ఎలా వుండాలి? అనే విషయం. మన దూరదర్శన్ (న్యూస్ చానల్స్) మరియు అంతర్జాలం లోనూ అతిగా కనిపిస్తున్న విషయం ఇది. మనకి ఇప్పుడు అతర్జాతియ నగరం కన్నా అంతర్జాతీయ రాష్టం కావలి. అర్ధశతాబ్దం ఎంతో కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ నగరం మన చేతుల నుంచి పోయింది. గతం గతః అని వదిలి వేస్తే, ఇప్పుడు మనం అలోచిన్చాలిసింది కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి అనే దాని గురించి. కానీ మన గతం నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటంటే కేంద్రికృతా అభివృద్ది వలెన లాభలు కంటే నస్టాలే ఎక్కువగా కానిపిస్తున్నాయి. రోజు రోజుకి మెట్రోపలిటన్ నగరాలూ సామాన్య జనజీవనానికి, ప్రభుత్వా కార్యకలాపాలకు చాల అసౌకర్యాలనూ కలిగిస్తున్నాయి. కావున రాజధాని అన్ని విదాల అభివృద్ధి చేయాలను కోవటం అనవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే నిలయం కావలి కానీ, అన్నింటికి అదే నిలయం కాకూడదు. మన గత రాజదానినే తీసుకొంటే అన్ని జాతీయ సంస్థలు, పోలీసు, మిలటరీ, రాజధాని, విద్యాసంస్థలు, ఉద్యోగాలు అవకాశాలు అన్ని అక్కడే వున్నాయి. అందువలన అక్కడ విద్యకానీ, రవాణకానీ, నిత్యావసరాలు కానీ చాల వ్యాయప్రయాసలతో నిండినవి.
ప్రస్తుత సంవత్సర కాలుష్య సంచిని గమనిస్తే మన అన్ని మెట్రోపలిటన్ నగరాలు వున్నాయి, ఈ మద్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన వార్త ఏమిటంటే మన దేశా రాజధాని అయిన డిల్లి కాలుష్యంలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో వుంది. హైదరాబాద్ బెంగలూరు కన్నా ముందు వుంది, విశాకపట్టణం హైదరాబాదుతొ సమానంగా వుంది. విజయవాడ వీటి తర్వాత కొన్ని స్థానల వెనుక వుంది. మరి కొన్ని రోజులలో అక్షిజెన్ కొనుక్కొనే పరిస్థితి వస్తుంది మెట్రోపలిటన్ నగరాలలో. ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చాల అవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే తప్ప, అభివృద్ధికి నెలవు కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయినా బాద వున్నా అన్ని శుభ సూచికలే కానిపిస్తున్నాయి. మన అదృష్టం కొద్ది అభివృద్దే ధ్యేయంగా సాగే ముక్యమంత్రి, అయనకి అనువైన కేంద్రప్రభుత్వం, రెండు చోట్ల దృడమైన ప్రభుత్వాలు, మన రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు, పెట్టుబడులు పెడుతమంటున్న పెట్టుబడి దారులు, ఇలా ఎన్నెన్నో అనుకుల విషయాలు.
చాల మంది కండిచే విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం. మన జిల్లాల దగ్గర నుంచి రాష్ట్ర, దేశ, విదేశ రాజదాణుల వరకూ ఎక్కువ శాతం ఒక పక్కన వున్నాయి. అందు వలనా మనం ఏదో ఒక పక్కన పెట్టు కోవలిసిన ఆవసరం లేదు. మన దేశంనే తీసుకోండి డిల్లి లో వుంది. రుచి చూడని మావిడి పుల్లన అని. మనమేక్కడో వుండి, డిల్లికి దగ్గరగా వుండే రాష్ట్రల ఉపయోగాలు ప్రయోజనాలను గుర్తించలేక పోతున్నారు. ఈ మద్య మద్యప్రదేశ్ లోని రైతులు గ్వాలియర్ నుంచి డిల్లిలో వాళ్ళ నిరసన తెలపటానికి బయలుదేరారని తెలిసిన వెంటనే వారితో చర్చలు జరిపి వెనుకకు పంపింది ప్రభుత్వం. డిల్లి నుంచి గ్వాలియర్కి ఐదు గంటల ప్రయాణం. మనకు ఒకరోజు ప్రయాణం అదే కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకి రెండు రోజుల ప్రయాణం. వారు ఒక వేళ బయలు దేరారని తెలిసిన ప్రభుత్వం దగ్గర రెండు రోజుల సమయం వుంటుంది. దక్షిణభారతం మీద చిన్న చూపు అనే విషయం అందు వలెనే వచిందేమో? మన జిల్లాకేంద్రాలనే తీసుకోండి మనకు చాల తక్కువ అవసరాలు వుంటాయి. నా చిన్నప్పుడు బస్సు పాస్ రెన్యువల్ చేసుకోవటానికి, నెలకి ఒక రోజు స్కూలుకి సెలవు పెట్టి మరి వెల్ల వలసి వచ్చేది, అదే మద్యలో వుంటే నాకు సెలవు పెట్టవలసిన ఆవసరం వుండేది కాదు.
దీనినుంచి గ్రహించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని దూరమైయ్యే కొద్ది కొన్ని జిల్లాలు తెలియని నష్టాలకి గురవుతాయి.  కనుక రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం మనం గ్రహించాలి. కానీ అది అన్ని విదాలుగా అభివృద్ది చెందాలనే ఆవసరం లేదు. మళ్ళి డిల్లినే తీసుకోండి. అది మన దేశరాజధానే కానీ, అన్ని రంగలలో అగ్రగామి కాదు. బొంబాయి ఆర్ధిక పరంగా, బెంగలూరు ఐటి రంగం లోనూ, చెన్నయ్ బ్యాంకింగ్ లోనూ, కలకత్తా ఎగుమతి/దిగుమతికి ఇంక ఎన్నో నాగరాలు వాటి వాటి ప్రత్యేకతలను బట్టి అగ్రగాములుగా నిలిచాయి. కానీ ఇవన్ని ఆ రాష్ట్రల రాజదాణులు అవటం వలనా అస్తఃవ్యస్తంగా తాయరయ్యాయి. గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకొంటే హైదరాబాద్ లాంటి సిటీ లేక పోయినా దేశంలో ముందంజలో వుంది. మన దేశంలో ప్రదానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహానగరాలు వెటికి ఒక ప్రణాళిక లేదు, మన నాయకులకి ఒక విజన్ లేదు. నా ఐదు సంవత్సరాలు నేను ఎలా కోలా నెట్టు కొచ్చి, అంత బాగుంటే మళ్ళి ఇంకో ఐదు సంవత్సరాలు పాలించటానికి ఏవో తాయిలాలు ఇచ్చి గెలుద్దమనే కానీ, ప్రజలనూ బాగాస్వములను చేసి వారికీ అర్థం అయ్యేలా చెప్పి ఒక ప్రణాళిక ప్రకారమ్, ఒక వేల ప్రతిపక్షాలు వచ్చిన వాటితో ఆ విజన్ ని ఎలా చేరుకోవలనేది ఎవరు ఆలోచించటం లేదు. రాజకీయాలు వదిలేద్దాం! రాజధానికి వద్దాం!

కనుక రాజధానికి అంతర్జాతీయ విమనశ్రయలు కానీ, అంతర్జాతీయ నగరాలు కానీ ఆవసరం లేదు కానీ అందరికి అందుబాటులో వుండాలి. దీనిని పరిగణలోకి తీసుకొని మన ముక్యమంత్రి గారు అనుకొంటున్న రాజధాని నగరం బౌగోలికంగా మద్యలోనే వున్నది కనుక దీనిని మనం రాజదానిగా అంగికరించ వచ్చును. కానీ అయన అంటున్న అన్ని అభివృద్ది కార్యక్రమాలు అనగా ఐటి హబ్ లు, SEZలు, ఇతర పరిశ్రమలు లాంటివి ఇక్కడే నెలకొల్పాలను కోవటం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడూ అనుకొంటున్న ప్రాంతంలోని భు విలువలు రాష్ట్రం ప్రకటించక ముందే ఆకాశాన్ని తాకుతున్నాయి. అది కాక ఈ జిల్లాలు వ్యవసాయ పరంగా చాల ముందు వున్నాయి.  ఈ ప్రాంతంలో రాజధాని వరకూ సరే గాని మెట్రోపోలిటన్ నగరాలకూ దీటుగా చెయ్యాలనే కోరికతో బంగారం పండించే భూమిని అభివృద్దిపేరుతో నాశనం చెయ్యొద్దని నా మనవి. మాకు ఒక మెట్రోపలిటన్ నగరం కన్నా అన్ని జిల్లాలు ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తూ, రెండవ తరగతి నగరాలుగా వున్న, మొత్తంగా రాష్ట్రం ముందంజలో వుండాలని కోరుకుంటూ సెలవు తీసుకొంటున్నాను.

మీ
సత్భోగి
13th June 2014

1 కామెంట్‌:

  1. నూతన ఆంద్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని గురించి ముఖ్యమంత్రి నుంచి సామాన్య ప్రజానీకం వరకు విపరీతంగా చర్చించు కోవడం జరుగుతూ ఉంది. కాబోయే రాజధాని అందరికీ సమాన దూరంలో ఉండాలని, అన్ని రకాల ప్రయాణ సౌకర్యాల ద్వారా చేరుకొనే వీలు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు.
    రాజధాని నిర్మించాలంటే భూమి అవసరము. నీరు లాంటి ఇతర వనరులు కూడా అవసరమే. కాని సాగులో ఉన్న భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం పూర్తిగా ఆలోచించ వలసిన విషయం. ముఖ్యంగా కోస్తా జిల్లాలలోని సాగు భూములు అత్యంత సారవంత మైనవి. ఇప్పటికే జనాభా పెరగడంతో చాలా పట్టణాలలో సాగు భూములు ఇళ్ళ ప్లాట్లుగా మారి పోయాయి. ఇప్పటికే రాజధాని ఊహలతో గుంటూరు, విజయవాడ పట్టణాల చుట్టూ ఉన్న వందల ఎకరాలు ప్లాట్లుగా మారిపోతున్నాయని వింటున్నాము. ఒక్కసారి వెనక్కు వెళ్తే శంషాబాదు మరియు దేవనహళ్లి ప్రాంతాలలో ఎయిర్ పోర్ట్ల పేరుతో ఎన్నో వందల ఎకరాలు ప్లాట్లుగా మారి బీళ్లుగా పడి ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. చెవులు హోరెత్తి పోయేటట్లు ఎయిర్ పోర్ట్ చుట్టూ వేలాది ఇళ్ళు అవసరమవుతుందని ఆ రోజు అందరూ జోస్యం చెప్పారు. చివరికీ సాగులో ఉన్న వందల ఎకరాలు బీళ్లుగా మారడం, తత్ఫలితంగా హైదరాబాదు మరియు బెంగళూరు నగరాల అవసరార్థం వచ్చే కూరగాయలు మరెంతో దూరం నుంచి రావలసి వస్తోంది. వాటి ధరలు పెరగడానికి కొద్ది మంది అత్యాశే కారణం. ఆ ఆశకు అందరూ మూల్యం చెల్లించుకోవలసివస్తోంది.
    తరతరాలుగా చక్కగా వ్యవసాయం చేసుకొనే రైతులు ఒక్క సారిగా వచ్చి పడ్డ డబ్బుతో వాళ్ళు ఏం చేసారో ఆలోచించండి. ఖరీదయిన భవనాలు కొని ఉండ వచ్చు. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఉండవచ్చు. ఘనంగా పెళ్ళిళ్ళు చేసి ఉండ వచ్చు. వారిలో కొంత మంది నడమంత్రపు సిరితో వివిధ వ్యసనాలకు లోనై బికారులుగా మారినట్లు కూడా విన్నాము. అంతే గాని వారెవ్వరూ మరోచోటికి వెళ్లి వ్యవసాయం చేసినట్లు వినలేదు. ఫలితం మంచి రైతులను పోగొట్టుకున్నామన్నది ఎవరూ కాదనలేని నిజం.
    కాబట్టి ప్రజా ప్రతినిధులు అందరూ సాగులో లేని విస్తారంగా ఉన్న ప్రభుత్వ భూములలో మాత్రమే రాజధాని ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొవాలి. ఆ చుట్టూ ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి అనువుగా సాగులో లేని భూములు దొరికేటట్లు వీలు ఉండాలి. భవిష్యత్తులో రాజధాని పెరిగినా భూమి లోటు రాకూడదు. ఇతర వనరులు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం అంతా మనచేతిలో ఉంది. పైపు లైన్ల ద్వారా నీళ్ళు తెచ్చుకో వచ్చు . రోడ్లు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా కాలక్రమేణా ఏర్పాటు చెసుకొదగ్గవి.
    అందరూ ఆలోచించండి! కోస్తా జిల్లాలలో ఉన్న బంగారంలాంటి సాగు భూములను కాపాడుకుందాం..

    రిప్లయితొలగించండి