12, జూన్ 2014, గురువారం

ఆంద్రప్రదేశ్(సీమాంద్రకి) కాకుండా కొత్త పేరు అవసరమా?

నేను ఈ మద్య వార్తలు చూస్తుంటే ఇంటిలిజేన్సియా పేరుతో న్యూస్ చానల్స్ అన్ని ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ అంటే దానిలోతప్పు ఏముందో తెలియటం లేదు. ఆంద్రప్రదేశ్ ఆంద్రులు నివసించే ప్రదేశం. ఇంత మంచి పేరుని మార్చటం అవసరమా? కేంద్రం పేరు మార్చటానికి కూడా అధికారం ఇవ్వటం లేదని ప్రచారం చేస్తున్నాయి.
ఇంటిలిజేన్సియా పేరుతో చాలా గొప్ప సలహాలు ఇస్తున్నారు, సీమాంద్ర అని, తెలుగునాడు, తెలుగు రాష్ట్రం అని, ఆంధ్రరాష్ట్రం అని ఇలా ఎన్నెన్నో పేర్లు.

వీళ్ళకి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ప్రదేశ్ హిందీ లేక సంస్కృతం అంటా? దీని వలనా తెలుగు అస్థిత్వం దేబ్బతింటూదని చెబుతున్నారు. అంటే అదిఇప్పటివరకు గుర్తు రాలేదా? విల్లంత ఇంతకి ముందు ఏమిచేసారు? హైదారాబాద్, వైజాగ్ ఇవన్ని తెలుగు పేరులా?

మన పేరో, ఇంటి పేరో, ఉరు పేరో బాగోలేదని మార్చేస్తామా? అల అయితే భవిష్యత్ తరాలకి ఈ పేరు నచ్చక వేరే పేరు పెట్టుకుంటారు. ఇప్పటికే చాల నగరాలకి చరిత్రలో ఒక పేరుంటుంది, మనం ఇప్పుడు వేరే పేరుతో పిలుస్తుంటాము. వాటిని అర్ధం చేసుకోలేక వాటిని ఆ చరిత్రాని మన ప్రాంతాలకు అన్వయిన్చుకోలేక చాల మందికి చరిత్ర అంటేనే విసుగు పుట్టించే విషయం అయింది.

మన  రాష్ట్రం ఆంద్రప్రదేశగా దేశంలో, ప్రపంచం మొత్తంలో చాల మదికి సుపరిచితం, ఇంతక ముందు డిల్లి వెళ్తే మాది తమిళ్ కాదు తెలుగు అని, ఆంధ్రాప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటుందని, దానిలో తెలుగు మాట్లాడతరాని చెప్పుకోవలిసి వచ్చేది. ఇప్పుడు మన ఈ తరం ప్రజలు, నాయకులు ఆంధ్రాప్రదేశ్ ఉనికిని దేశంలో, ప్రపంచంలో చాటి చెప్పారు. ఇప్పుడు మళ్ళి పేరు మార్చి మళ్ళి భావితారల వారు ఆ రాష్ట్రంమా ఇదుగో ఇది చరిత్ర అని చెప్పుకోవలిసిన పరిస్థితి తేకండి. ఆదిగాక ఇంతకముందు మనం ఎనిమిది కోట్లు ఇప్పుడూ ఐదు కోట్లు మన ఉనికిని చాటలంటే చాల కష్టపడాలి. ఆ బాధని తెలంగాణాకి వదిలేసి రాష్ట్రంని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించండి.

ఆంద్రప్రదేశ్ ఒక విధంగా మన దేశం భిన్నత్వం లో ఏకత్వం అని తెలియ చెప్పే పేరు అది. మనం అంత ఒకటే అనే భావాన్ని కలుగ చేస్తుంది. వీళ్ళకి(ఇంటిలిజేన్సియా) మైకు ఇస్తే తెలంగాణ వాళ్ళు తెలంగాణ తల్లిని పెట్టుకున్నారు. మనకేందూకి ఇద్దరి తల్లి తెలుగు తల్లి, కొత్త తల్లిని పెట్టుకుందామని అంటారు. తెలంగాణ గీతంలాగానే మా తెలుగుతల్లిని వదిలేసి వేరే గీతం పాడుకుందాం అంటారు.

తెలంగాణ వాళ్ళు విడిపోయినా ఒక పెద్దగ మన సౌభ్రాతృత్వంని మనం కాపాడుకుంటూ, ఆంద్రప్రదేశ్ పేరునే వుంచుకుందాం, మా తెలుగుతల్లినే పాడుకుంటూ మనమంత తెలుగు వారిమేనని గుర్తు చేస్తూ, మనం ఎప్పుడూ తెలుగు వారి మంచినే కోరుకుంటామని చెబుదాం. ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిచి ఎక్కడైన మేము అభివృద్ధిచేయగలమని, తెలంగణకి మంచే చేసాం కానీ చెడు చేయలేదని నిరూపిద్దాం.

జై ఆంద్రప్రదేశ్! జై జై ఆంద్రప్రదేశ్!!

మీ
సత్భోగి
12th June 2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి